24) నా సీనియర్‌ని ప్రేమించానుఅబార్షన్ చేయించుకుందామంటే డబ్బులకు ఇబ్బందినా సమస్య తీరిపోతుందా???

Q:: నేను బీఎస్సీ రెండో సంవత్సరం చదువు తున్నాను. నా సీనియర్‌ని ప్రేమించాను. కొద్దిరోజుల క్రితం అనుకోకుండా తనకి శారీరకంగా దగ్గరయ్యాను. ఈ నెల పీరియడ్స్ రాలేదు. పరీక్ష చేయిస్తే గర్భవతినని తేలింది. నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అబార్షన్ చేయించుకుందామంటే డబ్బులకు ఇబ్బంది. నువ్వులు తిన్నా, బొప్పాయి తిన్నా అబార్షన్ అయిపోతుందని నా ఫ్రెండ్ చెప్పింది. అది నిజమేనా? అవి తింటే నా సమస్య తీరిపోతుందా?telugusexdoutes


A:: తప్పు చేసి ఇప్పుడు భయపడితే ఏమి లాభం? నువ్వులు, బొప్పాయి తినడం వల్ల అబార్షన్ కాదు. నువ్వులు, ఇంకా పండిన బొప్పాయిలో విటమిన్స్, ఐరన్, కాల్షియం వంటి పోషక పదార్థాలు ఎన్నో ఉంటాయి. వాటిని మితంగా తినడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. వీటిని తింటూ కాలం వృథా చేసుకోవద్దు. రోజులు పెరిగేకొద్దీ లోపల బిడ్డ పెరిగిపోతూ ఉంటుంది. మొదట్లో, అంటే రెండు నెలల లోపలే అయితే 98 శాతం మందుల ద్వారా అబార్షన్ అయిపోతుంది. ఆలస్యం అయ్యేకొద్దీ ఆ అవకాశాలు తగ్గుతాయి. తర్వాత డీ అండ్ సీ ద్వారా గర్భాశయాన్ని శుభ్రపర్చాల్సి వస్తుంది. దీనికి ఖర్చు కూడా ఎక్కువ. పైగా ఇన్ఫెక్షన్ల వంటి ఇతర సమస్యలు ఏర్పడి తర్వాతి కాలంలో గర్భం ధరించడానికి ఇబ్బంది కావొచ్చు. కాబట్టి కనీసం ప్రభుత్వాసుపత్రికైనా త్వరగా వెళ్లి డాక్టర్‌ని సంప్రదించండి. ( డా. వేనాటి శోభ )


No comments