Q::మా అబ్బాయికి పదేళ్లు ఏళ్లు. పుట్టుకతోనే ఒక వృషణం సంచిలోకి జారకుండా కడుపులోనే ఉండిపోయింది. మా బాబు విషయంలో ఏమి చేయాలో తగిన సూచన ఇవ్వగలరు.
A::పుట్టుకతోనే వృషణాలు సంచిలోకి రాకపోవడాన్ని అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఇలా జారని వృషణాలు సాధారణంగా గజ్జెల్లో ఉండిపోతాయి. సాధారణంగా బాబు పుట్టినప్పుడు డాక్టర్లు వృషణాల పొజిషన్‌ను గమనిస్తుంటారు. ఒకవేళ ఆ సమయంలో వృషణాలు చేతిస్పర్షకు తగలకపోతే ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు అవి వృషణాల సంచిలోకి జారడం కోసం వేచిచూడవచ్చు. అప్పటికీ వాటంతట అవే రాకపోతే ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు ఆపరేషన్ చేసి వాటిని కిందికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్సనే ఆర్కిడోపెక్సీ అంటారు. ఒకవేళ రెండేళ్ల తర్వాత కూడా ఆపరేషన్ చేయించకపోతే లోపల ఉండిపోయిన టెస్టిస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ బాబు విషయంలో యూరాలజిస్ట్‌ను సంప్రదించి ఇప్పటికైనా ఆర్కిడోపెక్సీ లేదా ఆర్కిడెక్టమీ సర్జరీ చేయించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం యూరాలజిస్ట్‌ను వీలైనంత త్వరగా సంప్రదించండి. (డాక్టర్ వి. చంద్రమోహన్)
No comments