Q:: నా వయసు 37 ఏళ్లు. నాకు ఇటీవల అంగస్తంభనలు తగ్గాయి. నా అంతట నేనే మెడికల్ షాపుకు వెళ్లి వయాగ్రా టాబ్లెట్లు కొనుక్కోవచ్చా. అలా వయాగ్రా వాడితే ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదమా? నాకు తగిన సలహా ఇవ్వండి.
A:: సాధారణంగా మీరు యుక్తవయసులోనే ఉన్నప్పటికీ మీ వయసు వారిలో అప్పుడప్పుడు అంగస్తంభన లోపాలు రావడం చాలా సాధారణం. కొన్నిసార్లు ఇలా కావడానికి నిర్దిష్టంగా కారణం కూడా ఏమీ కనిపించకపోవచ్చు. ఇటువంటి వారిలో వయాగ్రా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వాళ్లలో ఆత్మవిశ్వాసం కలిగి తమంతట తామే ఎలాంటి టాబ్లెట్ల సహాయం లేకుండానే సెక్స్ చేయగలుగుతారు. కాని ఎవరు పడితే వాళ్లు స్వయం నిర్ణయం తీసుకుని వేసుకోడానికి ఉపయోగింమే సాధారణ మందు కాదు. ఈ మందు చాలా ప్రమాదకరం కాకపోయినప్పటికీ, కొద్దిమందిలో సైడ్ ఎఫెక్ట్స్ అవకాశాలు ఉంటాయి. అంతేకాదు… సెక్స్‌ను ఉద్దీపన కలిగించే మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం చట్టబద్ధంగా నేరం. కొన్ని కాంబినేషన్లలో వయాగ్రా వాడకూడదు. అది స్పెషలిస్ట్‌లు నిర్ధారణ చేస్తారు. ఈ మందులకు వారి ప్రిస్క్రిప్షన్ అవసరం. అందువల్ల మీ ఆరోగ్యం కోసమే యూరాలజిస్ట్‌ను / మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి ఆ మందు వాడటం మీకే శ్రేయస్కరం. (డాక్టర్ వి. చంద్రమోహన్

No comments