Q:: నా వయస్సు 28 ఏళ్లు. నాకు రెండేళ్ల క్రితం టీబీ పాజిటివ్ వచ్చింది. ఆర్నెల్లు డాట్స్ చికిత్స తీసుకున్నాను. పూర్తిగా తగ్గిందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో నా సెక్స్ జీవితానికి ఏమైనా సమస్యలు వస్తాయా? నేను పెళ్లిచేసుకోవచ్చా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే దీనిల్ల నా భార్యకు, పిల్లలకు ఏమైనా సమస్యలు వస్తాయా?
A::టీబీ వచ్చిన వారు యాంటీబయాటిక్ ట్రీట్‌మెంట్ పూర్తి కోర్సు తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే మందులు ఆపకుండా డాక్టర్లు సూచించిన విధంగా వ్యాధి నయమయ్యేవరకు తీసుకోవాలి. అలా ఒకసారి పూర్తిగా నయం అయితే ఆ వ్యాధి వల్ల మీ సెక్స్ సామర్థ్యం ఎంతమాత్రమూ దెబ్బతినదు. వృషణాలకు టీబీ రాకుండా ఉంటే వీర్యం ఉత్పత్తి మీద కూడా దాని ప్రభావం ఉండదు. కాబట్టి మీ సెక్స్ సామర్థ్యం విషయంలో మీకు ఎలాంటి ఆందోళన, సంకోచం అక్కర్లేదు. పెళ్లికిగాని, భవిష్యత్తులో బిడ్డలను కనడానికి గాని మీకు వచ్చి తగ్గిపోయిన జబ్బు ఎంతమాత్రమూ ఆటకం కాదు. మీరు ప్రస్తావించిన అంశాలకూ మీకు వచ్చి తగ్గిన టీబీతో ఎంతమాత్రమూ సంబంధం లేదు. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. (డాక్టర్ వి. చంద్రమోహన్)
No comments